ఏ ఎస్ పేట మండలం చిరమన గ్రామంలోని పొలాలలో పేకాట ఆడుతున్న విషయం తెలుసుకున్న ఎస్సై సైదులు సిబ్బంది తో కలిసి బుధవారం దాడి చేశాడు. 7 మంది పేకాట ఆడుతున్న వారిని పట్టుకొన్నారు. వారి దగ్గర నుండి రూ. 8, 8680 నగదు, 5 బైక్ లు, 6 సెల్ ఫోన్ లు సీజ్ చేశారు. నిందితుల పై కేసు నమోదు చేశారు. ఎస్సై మాట్లాడుతూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.