ఏ.ఎస్.పేట మండలం అనుమసముద్రం గ్రామంలోని ఎస్.టి.కాలనీలో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. "తల్లికి వందనం" పథకం ద్వారా విద్యార్థుల సంఖ్యను బట్టి తల్లిదండ్రుల ఖాతాలో నగదు జమ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక తల్లికి నలుగురు పిల్లలకుగాను ₹52,000 జమ కావడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ వేడుకలో పులిమి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.