నెల్లూరు జిల్లా ఏఎస్ పేట పంచాయతీ పరిధిలోని గండువారిపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరాల ప్రవేశాలకు దరఖాస్తులు గడువు పొడిగించారు. ఈ మేరకు శనివారం ప్రిన్సిపాల్ బి. శ్రీలక్ష్మమ్మ మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ బైపిసి గ్రూప్లో 40 సీట్లు, సెకండ్ ఇయర్ బైపిసి గ్రూప్ లో 5 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అన్నారు. 21వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు తెలిపారు.