దేవాలయాల్లో దొంగతనం చేసిన నిందితులు అరెస్ట్

67చూసినవారు
దేవాలయాల్లో దొంగతనం చేసిన నిందితులు అరెస్ట్
ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఆరు దేవాలయాల్లో దొంగతనాలు జరగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మకూరు డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి వేణుగోపాల్ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దొంగల నుంచి సుమారు లక్ష విలువ గల బంగారు, వెండి వస్తువులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇకపై దేవాలయాల మీద ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్