విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమత్తులు, పలు సమస్యల కారణంగా మర్రిపాడు మండలంలోని పలు గ్రామాలకు శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.