అనంతసాగరం: పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య దాడి

55చూసినవారు
అనంతసాగరం: పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య దాడి
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మేకవారిపల్లి గ్రామంలో ఓ పొలం విషయమై ఇరు వర్గాల మధ్య గురువారం రాత్రి భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. రీ సర్వేలో ఒకరి పొలం మరొకరి పేరు మీద పడడంతో ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. చర్చలకు రావాలని ఓ వర్గం వారు పిలిచి మారణాయుధాలతో దాడి చేశారంటూ మరో వర్గం వారు ఆరోపించారు. 6 మందికి గాయాలు కావడంతో వారిని ఆత్మకూరు ఆసుపత్రి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్