అనంతసాగరం ఎమ్ ఆర్ ఓ సస్పెండ్

72చూసినవారు
అనంతసాగరం ఎమ్ ఆర్ ఓ సస్పెండ్
నెల్లూరు జిల్లా అనంతసాగరం ఎమ్మార్వో కె. వీర వసంతరావు పై సస్పెన్షన్ వేటు పడింది. ఈయన గతంలో పొదలకూరు తహసిల్దారుగా విధులు నిర్వహిస్తుండగా భూ పంపిణీ, భూ సమస్యల పై అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. విచారణలో అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారణ అవడంతో ఎమ్మార్వో కె. వీర వసంతరావు ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఓ. ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్