ఈసారి మామిడి రైతులు తీవ్రంగా నష్టానికి గురైనట్లు తెలుస్తోంది. పండించిన మామిడి పంటకు సరైన ఆదాయం లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అనంతసాగరం మండలంలో పలువురు రైతులు మామిడి పండ్లను ట్రాక్టర్లో పట్టణాలు, పల్లెటూర్లకు తీసుకొచ్చి కేవలం కేజీ రూ. 20 చొప్పున అమ్ముతున్నారు. వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో తామే నేరుగా వచ్చి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోయారు.