గత ప్రభుత్వ హయాంలో అనంతసాగరంలో ఇళ్ళ నిర్మాణాల కోసం మూడు లేఅవుట్లు వేశారు. ఇక్కడ 200 గృహాల వరకు నిర్మాణాలను జరుగుతున్నాయి. అధికారులు సీసీ రోడ్లు వేయడంలో నిర్లక్ష్యం చూపడంతో వర్షం పడినప్పుడు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దారులన్నిదారులన్నీ బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిసిసీసీ రోడ్లు వేసి ఇబ్బందులు తొలగించాలని కోరారు.