అనంతసాగరం: ప్రభుత్వ కార్యాలయాల వద్ద కనీసం మరుగుదొడ్లు లేవు

52చూసినవారు
అనంతసాగరం: ప్రభుత్వ కార్యాలయాల వద్ద కనీసం మరుగుదొడ్లు లేవు
అనంతసాగరం ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనంతసాగరంలో ఎంపీడీవో, అగ్రికల్చర్, విద్యాశాఖ కార్యాలయాలు ఒకే చోట ఉన్నాయి. వివిధ పనులు నిమిత్తం కార్యాలయాలకు భారీగా ప్రజలు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ మరుగుదొడ్లు లేకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మూడు కార్యాలయాలు పక్కపక్కనే ఉన్నప్పటికీ ప్రజల కొరకు బాత్రూంలు లేవని విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్