అనంతసాగరం: కందుకూరి వీరేశలింగానికి నివాళులు

61చూసినవారు
అనంతసాగరం: కందుకూరి వీరేశలింగానికి నివాళులు
ప్రముఖ తెలుగు రచయిత, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా బుధవారం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ బాల్యవివాహాలు, సతీసహగమనం వంటి సామాజిక దురాచారాల నిర్మూలనకు వీరేశలింగం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, వెంకటేశ్వర్లు, రమణ రాజు, మదీనా, కృష్ణారెడ్డి, మాధవి, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్