అనంతసాగరం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో యోగాంద్ర-2025 కార్యక్రమం లో భాగంగా సచివాలయ ఉద్యోగులతో పాటు స్థానికులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగి, యోగా ట్రైనర్ మురళి వారి చేత యోగాసనాలు వేయించారు. అలాగే యోగ చేయడం వలన వచ్చే లాభాలను వివరించారు. దీర్ఘకాలిక జబ్బులు పోవాలంటే తప్పకుండా యోగా చేయాలని సూచించారు. యోగ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మంచిదని తెలిపారు.