ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండలంలో శనివారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో ప్రసన్నకుమారి శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీపీ పద్మజారెడ్డి, జెడ్పిటిసి రాజేశ్వరమ్మ హాజరవుతారని పేర్కొన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, సాగునీరు, ఐసిడిఎస్, గృహ నిర్మాణం, విద్య, వైద్యం గురించి ఈ సమావేశంలో చర్చిస్తారని అధికారులు తమ తమ నివేదికతో హాజరు కావాలని కోరారు.