ఏఎస్ పేట లోని ఆటో డ్రైవర్లు రొట్టెల పండుగకు వచ్చే భక్తులు ఆటోలలో వెళ్లేటప్పుడు ఆటోలను జాగ్రత్తగా నడపాలని, అధిక లోడు ఎక్కువమందిని ఎక్కించుకోరాదని MVI రాములు ఆటో యూనియన్ నాయకులకు సూచించారు. అధిక లోడు ఎక్కించడం వెనక పక్క డోర్ తీసి కూర్చోబెట్టడం ఎక్కువ చార్జీలు వసూలు చేయడం వంటివి చేయరాదని ముఖ్యంగా ఏఎస్ పేట క్రాస్ ఆర్చి వద్ద జాగ్రత్తగా నడపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.