ఏఎస్ పేట మండలం రాజవోలులో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. 'ఆంగన్వాడీ పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా చిన్నారుల చేత అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సీడీపీవో సునీత, అంగన్వాడీ సూపర్ వైజర్ కస్తూరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారులకు ఆటపాటలతో విద్యాబోధన అందించి, పౌష్టికాహారం కూడా ఇవ్వనున్నట్లు సీడీపీవో తెలిపారు.