నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలం జమ్మవరం గ్రామంలో మంత్రి ఆనంకు స్థానిక నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా జమ్మవరం గ్రామానికి విచ్చేసిన మంత్రి ఆనంకి ప్రతి గడపలోనూ అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన మినీ గోకులాలను, సిమెంట్ రోడ్డును మంత్రి ఆనం ప్రారంభించారు.