ఏఎస్ పేట మండలం చౌట భీమవరం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఇద్దరు కలసి వెటర్నరీ అసిస్టెంట్ దేవకుమార్ అనే ఉద్యోగికి ఈ నెల జీతం బిల్లు ప్రభుత్వానికి పంపలేదు. దీంతో సదరు ఉద్యోగి పంచాయతీ కార్యదర్శిని నాకు ఈ నెల జీతం ఎందుకు పెట్టలేదని కారణం చెప్పమని అడిగినప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని దేవకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవోకి శుక్రవారం అర్జీ అందజేశాడు.