ఆత్మకూరు టిడ్కో హౌసింగ్ కాలనీ ప్రజల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో శ్రీ సీతారాముల స్వామి వారి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని టిడ్కో గృహాల వద్ద సీతారాముల ఆలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఐదు మంది మంత్రుల బృందం ఆధ్వర్యంలో ఆత్మకూరులో శంకుస్థాపన జరిగింది. ఆత్మకూరు నుంచే సీతారాముల ఆలయ ఏర్పాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.