ఆత్మకూరు పురపాల సంఘం నందు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, ఇతర కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి జీవనోపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించడం జరుగుతుందని మునిసిపల్ కమిషనర్ గంగ ప్రసాద్ తెలిపారు. సబ్సిడీ రుణాలు అవసరమైన వారు ఏపీఓబిఎంఎంఎస్ నందు ఈనెల 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు తగిన పత్రాలతో సచివాలయం లేదా ఇంటర్నెట్ సెంటర్లో కాని దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.