అనుముసముద్రం గ్రామంలో సిజెఎఫ్ఎస్ భూములను ఎస్సీ కులాల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సీ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఉమ్మడిగా సాగు చేసిన పంటను సరైన ధరకు అమ్ముకునేందుకు ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భూమి రెడ్డి పావని, ఏపీఎంఐపి పిడి శ్రీనివాసులు ఉన్నారు.