నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు 8. 2, సంగం 6. 4, అనంతసాగరం 2. 4, కలువాయి 2 మొత్తం డివిజన్ పరిధిలో 19 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. పలు మండలాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసినట్లు తెలిపారు.