ఆత్మకూరు: గురుకుల పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు

70చూసినవారు
ఆత్మకూరు: గురుకుల పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని గురుకుల పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు గురువారం నిర్వహించారు. విద్యార్థులకు సంక్రాంతి సెలవులు కావడంతో ఇళ్లకు వెళ్లే నేపథ్యంలో ముందస్తుగా ప్రిన్సిపాల్ కామేశ్వరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు పాఠశాల సిబ్బంది కలిసి భారీ భోగిమంట వేశారు. గురుకుల పాఠశాలను ప్రత్యేకంగా అలంకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్