రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో బుధవారం ఆత్మకూరు రూరల్ మండలం రావులకొల్లు గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అగ్రికల్చర్ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయానికి సంబంధించినటువంటి పలు సూచనలు, సలహాలు చేశారు.