ఆత్మకూరు: సీఐ పర్యవేక్షణలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

52చూసినవారు
ఆత్మకూరు: సీఐ పర్యవేక్షణలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా ఆత్మకూరు సిఐ గంగాధర్ నేతృత్వంలో "రోడ్డు ప్రమాదాలు దుష్పరిణామాలు" అనే అంశంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో మండల స్థాయిలోని వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సీఐ గంగాధర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు వాహనాలు నడపవద్దని సూచించారు. మీ యెక్క కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని విద్యార్థులకు సీఐ మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్