ఆత్మకూరులోని శ్రీ అవధూత కాశినాయన స్వామి ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి భారీ విరాళం అందింది. సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచి పరమేశ్వర్ రెడ్డి రూ. ఒక లక్ష విరాళం గురువారం ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశ్యంతో విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ నగదుతో పాఠశాలలో మరుగుదొడ్లు, త్రాగునీరు అలాగే విద్యార్థులకు కావలసిన కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.