సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గంటా శ్రీనివాసరావు, మ్యారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య దర్శించుకున్నారు. కప్పస్తంభం ఆలింగనం స్వామివారి దర్శనం అనంతరం మంత్రులకు వేద ఆశీర్వాదం అందించారు వేద పండితులు. మంత్రులకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.