మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులపై సమస్యలు పరిష్కారం దిశగా అక్కడక్కడే అధికారులతో మంత్రి మాట్లాడారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ఆనం తో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ కూడా పాల్గొన్నారు.