జనవరి 11వ తేది ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన వివరాలు. రేపు ఉదయం 10 గంటలకు ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.