ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని దేవదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు స్థానికులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను మంత్రి స్వీకరించారు. ప్రజలందరిపై రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం కోరుకున్నారు.