గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని, మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో మెడికోలు చనిపోవడం కూడా తీవ్రంగా బాధకు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.