ఆత్మకూరు: స్వర్ణాంధ్ర 2047పై మంత్రి సమీక్ష

59చూసినవారు
ఆత్మకూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్నిశాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర 2047 పై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఆత్మకూరు ఆర్డీవో పావని, చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి రఘురామయ్య, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్