విజయవాడలో ఆదివారం జరగనున్న హైందవ శంఖారావానికి ఆత్మకూరు, చేజర్ల మండలాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో బస్సుల్లో తరలి వెళ్లారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని హిందువులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు.