నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.