నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కొత్తూరు వద్ద శుక్రవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొని అప్పారావు పాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఉదయగిరి జస్వంత్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా జస్వంత్ (15) పదవ తరగతి చదువుతున్నాడు. వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ జశ్వంత్ ను ఢీకొని అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.