నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టే పాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో జడ్పీ నిధులతో బోరు ఏర్పాటు చేశారు. ఈ పనులను ఎంపీటీసీ తూమాటి శశిధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. నీటి సమస్య ఉన్న విషయం దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన చొరవ తీసుకొని పనులు మంజూరు చేశారు. బోరు పనులు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.