ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి తాగిన, అమ్మినా జైలుకు పోతారని హెచ్చరించారు. గంజాయి అనేది ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందని దానికి ప్రతి ఒక్కరు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలన్నారు. మీ (ప్రజలు) పరిసరాలలో ఎక్కడైనా గంజాయి వికరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.