ఆత్మకూరులోని సెయింట్ మేరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షేక్ షంషీన్ (13) కనిపించకపోవడంతో ఆత్మకూరు సీఐ గంగాధర్ ఆ బాలికను ఉదయగిరి బస్టాండ్ లో గుర్తించి తీసుకువచ్చారు. ఆ బాలిక తల్లి చనిపోయినందున మేనమామ దగ్గర ఉంటూ చదువుకుంటుంది. చదవాలనే ఆసక్తి ఆ బాలికకు లేకపోయినా, మేనమామ ప్రెజర్ పెట్టడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.