ఆత్మకూరు బైపాస్ రోడ్డులో భారీ గుంటలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలుమార్లు చిన్నపాటి ప్రమాదాలు కూడా జరిగాయి. తెలుగు సేవా సమితి ఆధ్వర్యంలో విశ్రాంతి ప్రధానోపాధ్యాయుడు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులతో కలిసి గురువారం ఆ గుంతలను రాళ్లు ఇసుక వేసి పూడ్చారు. దీంతో పలువురు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అంకెనపల్లి గోవిందరెడ్డి, నారాయణరావు, పెద వెంకటరెడ్డి, కొల్లా వెంకటేశ్వర్లు ఉన్నారు.