1 నుంచి సోమశిలలో చేపల వేట నిషేధం

71చూసినవారు
1 నుంచి సోమశిలలో చేపల వేట నిషేధం
అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో జులై 1వ తేదీ నుంచి చేపల వేటను నిషేధిస్తున్నామని మత్స్యశాఖ ఏడీ శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 31వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుందని చెప్పారు. ఈ రెండు నెలల సమయంలో తల్లి చేప గుడ్లు పెడుతుందని తెలిపారు. చేపల ఉత్పత్తి పెరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అతిక్రమించి ఎవరైనా చేపలు వేట చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్