ఆత్మకూరు ఆర్డీవో మధులత ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆమె పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పి కృష్ణ కాంత్ ఉన్నారు.