చేజర్ల మండలంలోని ఆదురుపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో (కేజీబీవీ) శుక్రవారం మహిళా సాధికారత అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ హేనా సుజన ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ శైలజ కుమారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం భేటీ బచావో- భేటీ పడావో పై అవగాహన. ఆడపిల్లలను రక్షించాలి వారిని చదివించాలని, మహిళలు కూడా సమాజంలో అగ్రగామిగా నిలవాలని తెలిపారు.