ఆ గ్రామంలో ఎస్సై కృషి ఫలించింది. చేజర్ల మండలం లోని ప్రధాన పట్టణమైన ఆదురుపల్లి లో పారిశుద్ధ్యం, చోరీలపై గురువారం ఎస్సై తిరుమలరావు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గతంలో రోడ్ల వెంట కుప్పలు కుప్పలుగా చెత్తాచెదారం ఉండేది, ఎస్ఐ సూచనలతో ప్రజలు ప్రేరణ పొంది రోడ్లపై చెత్త లేకుండా చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ రోడ్లపై చెత్త లేకుండా ఉంచి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు.