ఆనందంగా జీవిస్తున్న ఆ కుటుంబంలో అగ్ని ప్రమాదం మరిచిపోలేని విషాదాన్ని నింపింది. చేజర్ల మండలం ఆదూరుపల్లి ఎస్టీ కాలనీలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఇల్లులు పూర్తిగా దగ్ధమయ్యాయి. చెంచయ్య అతని ఇద్దరు కుమారుల ఇల్లులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.కాలిబూడిదయ్యాయి. చెంచయ్య తన మనవడి పెళ్లి కోసం దాచిన రూ. 3 లక్షలు నగదు, 3 సవర్ల బంగారం ఆ మంటలకు ఆహుతి అయిపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.