నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని ఆదురుపల్లి సెంటర్లో బిరదవోలు గ్రామానికి చెందిన మేకల కాపరులు ఒక లారీని గురువారం నిలిపివేశారు. నాయుడుపేట నుంచి తెలంగాణ తాండూరుకు లోడుతో వెళ్తున్న లారీ బిరదవోలు వద్ద ఓ మేకపోతును తొక్కేసింది. అయినప్పటికీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఆపకుండా వెళ్లడంతో కాపరులు వెంబడించి ఆదురుపల్లి వద్ద లారీని అడ్డగించి, డ్రైవర్ వద్ద నుంచి నష్టపరిహారం వసూలు చేశారు.