నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు నాలుగు అర్జీలు వచ్చినట్లు తహశీల్దార్ మురళి తెలిపారు. సంబంధిత శాఖ అధికారులకు అర్జీలు అందజేసి పరిష్కరించాలని తెలిపినట్లు ఆయన వివరించారు. ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ డే ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. భూ సమస్యలతో పాటు పలు రకాల సమస్యలపై అర్జీలు అందజేయాలని కోరారు.