తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో బాలికల కోసం నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల, బాలురు కోసం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఎంపిక కాబడిన విద్యార్థులు జాబితాను తిరుమల తిరుపతి దేవస్థానం సోమవారం విడుదల చేసింది. చిలకలమర్రి జడ్పీ హైస్కూల్ విద్యార్థులు మహాలక్ష్మి, మనోజ్ లు ఈ కళాశాలలో ప్రవేశాలకు అర్హత సాధించారు.