ఆత్మకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో చిన్నారుల తల్లిదండ్రులు, యువత వేసవి సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఆత్మకూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ జి. గంగాధర్ సూచించారు. ప్రస్తుతం పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ఇచ్చి చిన్నారులు, యువకులు చెరువులు, బావుల వద్దకు వెళ్ళవద్దని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. పిల్లలు స్నేహితులతో కలిసి సరదాగా వెళ్తుంటారని తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు.