ఇటీవల కాలంలో సంఘం, బుచ్చి పరిధిలో వరుసగా చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్న వాహనాలను పోలీసులు పట్టుకుంటున్నారు. సోమవారం సంఘం మండలం పడమటిపాలెంలో ఉన్న ఓ చాపల కుంటకు వంగల్లు గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరు నుంచి తీసుకువస్తున్న వ్యర్ధాలను పోలీసులు పట్టుకున్నారు. ఆ యువకుడు గత కొంతకాలంగా ఇదే పని చేస్తున్నాడు. ఆ యువకుడు వచ్చే వాహనాల నుంచి దుర్వాసన రావడంతో రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.