సంఘం: అగ్నిప్రమాదంతో పూరిల్లు దగ్ధం

75చూసినవారు
సంఘం: అగ్నిప్రమాదంతో పూరిల్లు దగ్ధం
నెల్లూరు జిల్లా సంఘం మండలం అన్నారెడ్డి పాలెం పంచాయతీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆదివారం పూరిల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గృహోపకరణాలు దగ్ధమవడంతో రూ. 20వేల నష్టం జరిగిందని బాధితురాలు రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్