మర్రిపాడు మండలంలో కుళ్లిన మృతదేహం లభ్యం

77చూసినవారు
మర్రిపాడు మండలంలో కుళ్లిన మృతదేహం కలకలం రేపింది. మండలంలోని డీసీపల్లి గ్రామానికి చెందిన మైలు వెంకటేశ్వర్లు గత 30 రోజుల నుంచి కనబడకుండా పోయాడు. కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలోని ఖాన్ సాహెబ్ పేట అటవీ ప్రాంతంలో కుళ్ళిన మృతదేహం ఉందని పోలీసులకు గురువారం సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. మృతి చెందిన వ్యక్తి మైలు వెంకటేశ్వర్లుగా గుర్తించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్